Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 572

వేమన శతకం (Vemana Shatakam) - 572

వరలు రత్నసమితివలె గూర్చు ధాన్యంబు
చక్కదంచి వండి మిక్కుటముగ
సుష్టు బోజనముల జూఱగా నిడువాడు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
రత్నాలవంటి ధాన్యాలను పండించి, చక్కగా దంచి, రుచికరంగా వండి, తృప్తిగా ఇతరులకు బోజనం పెట్టెవాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, అతనే దైవసమానుడు.

No comments:

Post a Comment