Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 570

వేమన శతకం (Vemana Shatakam) - 570

చదివి చదివి చదివి చావంగ నేటికి?
చావులేని చదువు చదవవలయు
చదువులేక కోటి జనులు చచ్చిరికదా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పనికి రాని చదువులు ఎన్ని చదివినా ఏమి ప్రయోజనం. అసలు చావంటూ లేని చదువు ఐన తత్వం చదివితే సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. ఈ విషయం తెలియకుండానే వ్యర్దమైన చదువులు చదివి వ్యర్దంగానే చనిపోతుంటారు.

No comments:

Post a Comment