Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 565

వేమన శతకం (Vemana Shatakam) - 565

ఋషులటవినుండి రుచులు కోరుట రోత
నరులు కలిగి తినమి యరయ రోత
భార్యలనుచు వారి భరియింపమియు రోత
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అడవిలో ఉంటూ ఋషులమని చెప్పుకుంటూ షడ్రుచుల భోజనం కోరుకొనడం, తినే అవకాశం ఉన్నా తినకుండా ఉండటనం, పెండ్లాడిన భార్యలను పోషింపకుండా ఉండటం, వీటి కంటే రోత పని ఇంకొకటి లేదు.

No comments:

Post a Comment