Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 564

వేమన శతకం (Vemana Shatakam) - 564

చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి
ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి
మిట్టిపడును మీది పట్టేల యెఱుగడో
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
పెద్ద పెద్ద గోడలతో, చెట్లు కొట్టేసిన కొయ్యలతో, మంచి ఇటుకులతో ఇల్లు కట్టి అదే శాశ్వతమని ఆనందిస్తూ ఉంటారు. కట్టినవాళ్ళె శాశ్వతంగా ఉండరు అనే సత్యాన్ని తెలుసుకోలేరు.

No comments:

Post a Comment