Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 563

వేమన శతకం (Vemana Shatakam) - 563

చదివినయ్యకన్న చాకలియె మేలు
గృహమువేల్పు కన్న గేదెమేలు
బాపనయ్యకన్న బైనీడు మేలయా!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మంచితనం లేని విద్వాంసునికన్నా మన బట్టలు ఉతికే చాకలి వాడు మేలు. అలాగే కోరిన వరాలియ్యని ఇలవేల్పు కన్నా, పాలిచ్చె పాడి గేదె మేలు. నీతిలేని బ్రహ్మణుని కన్నా నీచజాతి మానవుడు మేలు.

No comments:

Post a Comment