Sunday, October 20, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 562

వేమన శతకం (Vemana Shatakam) - 562

వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల
బట్టవచ్చుగాని పాడుకర్మ
గురుని బోధలేక కుదుట నొందదు సుమీ!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
అడవిలోని క్రూర మృగాలెన్నైనా వలవేసి బంధించి పట్టుకోనుట సాధ్యమేకాని గురువు సహాయం లేకుండా మనస్సును అదుపులో పెట్టుకోవడం అసాధ్యం.

No comments:

Post a Comment