వేమన శతకం (Vemana Shatakam) - 559
దానమరసిచేయు దాత దగ్గఱజేరి
వక్రభాషణములు పలుకు మొఱకు
చందనతరునందు సర్పమున్నట్లయా!
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
గంధపు చెట్టుమీద ఉండే పాము ఎలాగైతే గంధము వాసన పీల్చడానికి వచ్చిన వాళ్ళను బెదరగొట్టి వెల్లకొడుతుందో, అదే విధంగా మూర్ఖుడు, దానం చేసే దాత వద్దన చేరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఆశ్రయం సంపాదించి ఇంక ఎవరినీ అతని వద్దకు చేరనీయడు.

No comments:
Post a Comment