Thursday, October 17, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 553

వేమన శతకం (Vemana Shatakam) - 553

దుష్టజనులు మీఱి తుంటరిపనులను
శిష్టకార్యములుగ జేయుచుంద్రు
కూడదనెడువారి గూడ నిందింతురు
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దుష్టులు తాము చేసేవి చెడ్డపనులైనా కాని మంచి పనులేనని వాదిస్తూ ఉంటారు.పైగా అలాంటి పనులు చేయకూడదు అని చెప్పినవారిని తిడతారు. ఈ విధమైన వారికి దూరంగా ఉండటం మేలు.

No comments:

Post a Comment