Monday, September 30, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 441

వేమన శతకం (Vemana Shatakam) - 441

రజ్జు లాడరాదు రణభూమి లోపల
బుజ్జగింప రాదు బొంకు వాని
నొజ్జతోడ వాదు లొనరంగ మానరా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
యుద్ధభూమిలో మనలో మనం గొడవపడకూడదు. అబద్దలాడేవానిని బుజ్జగింపకూడదు. అలాగే గురువులతో వితండవాదం చేయకూడదు.

No comments:

Post a Comment