Sunday, September 29, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 421

వేమన శతకం (Vemana Shatakam) - 421

విడువ ముడువ లేక కుడువగట్టగ లేక
వెఱపులేక విద్య విధములేక
వెడలేని వాని నడిపీను గనరొకో
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తాను తినడానికి, ఇతరులకు పెట్టడానికి ధనము లేని వాడు, విద్యా వివేకం లేని వారు, కనీసం నలుగురిలో తిరిగే ధైర్యం లేని వారు, బ్రతికున్నా శవంతో సమానం.

No comments:

Post a Comment