వేమన శతకం (Vemana Shatakam) - 419
వెఱ్ఱి వేషములను వేసికోబోకుము
కఱ్ఱికుక్క తెలుపుగాదు సుమ్ము
పుఱ్ఱెలోని గుణము పూడ్పింపజనవలె
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
మనలో ఉన్న మనసును మార్చుకోకుండా ఎన్ని వేషాలు వేసినా లాభం ఉండదు. నల్ల కుక్కను ఎంత తోమినా తెల్లబడదు.

No comments:
Post a Comment