Sunday, September 29, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 418

వేమన శతకం (Vemana Shatakam) - 418

బోడితలల జడల బూడిద పూతల
భాష్ణాసనముల వేషములను
యోగులైరె లోన బాగు గాకుండిన
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
తలలకు గుండు కొట్టిచ్చుకుని, ఒళ్ళంతా బూడిద పూసుకుని, పెద్ద పెద్ద జళ్ళు వేసుకుని, వేష భాషలు మార్చుకున్నంత మాత్రాన మనశ్శుద్ది లేకుండా పుణ్యం కలుగదు.

No comments:

Post a Comment