Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 415

వేమన శతకం (Vemana Shatakam) - 415

సకలతీర్ధములను సకలయఙంబుల
తలలు గొరిగినంత ఫలము గలదె
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వధాభిరామ వినురవేమ


భావం:-
సకల యఙాలు చేసి, సకల తీర్ధాలు తిరిగి, గుండు కొట్టిచ్చుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేయదు. తలలు బోడిగా శుభ్రంగా ఉన్నట్లు ఏ ఆలొచనలు లేకుండా మనసు ఉండగలదా?

No comments:

Post a Comment