వేమన శతకం (Vemana Shatakam) - 413
తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ
తనదు భార్య సుతులు తగినవారు
నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని
తనదు మంచి తోడు తనకు వేమ
భావం:-
మన ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళే వేళ, భార్య కాని, కొడుకులు కూతుళ్ళు కాని, చుట్టాలు కాని, స్నెహితులు కాని ఎవరూ వెంట రారు. మన ప్రాణంతోటి మనం చేసిన మంచి పనులు మాత్రమే తోడు వస్తాయి.

No comments:
Post a Comment