Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 412

వేమన శతకం (Vemana Shatakam) - 412

కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు
దానశీలుడంచు దలపబడెను
తలపధనము కర్ణుదాతజేసెను సుమీ!
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
లోకంలో కెల్ల కర్ణునికి మించిన దాత లేడని ప్రతీతి. కర్ణుడు తన దగ్గర ధనం ఉండబట్టె కదా దానం చేయగలిగాడు. కాబట్టి అతనికొచ్చిన కీర్తంతా ధనానిదే.

No comments:

Post a Comment