Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 408

వేమన శతకం (Vemana Shatakam) - 408

ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ
భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే
యెంత చెప్పి చివరనెసగిన బొసగునే
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
గాడిద పాలు తెచ్చి బాగ కాచి పంచదార వేసినా ఎందుకూ పనికి రావు. అలాగే ఙానములేని వాడికి ఎంత చెప్పినా వృదాయె.

No comments:

Post a Comment