వేమన శతకం (Vemana Shatakam) - 407
కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు
పనికి వీలుపడును బాగుగాను
కూలబడిన నరుడు కుదురుట యరుదయా
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:-
కుండకు చిల్లుపడినా కాని దాంట్లో గుడ్డను కుక్కి వాడుకోవచ్చు. అది బాగానే పని చేస్తుంది. కాని ఒక్కసారి జీవితంలో బాగ దెబ్బతిన్న మనుషులు మళ్ళీ కోలుకోవడం కష్టం.

No comments:
Post a Comment