Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 406

వేమన శతకం (Vemana Shatakam) - 406

మాటలాడగలుగు మర్మము లెఱిగిన
పిన్న పెద్దతనము లెన్నవలదు
పిన్నచేతిదివ్వె పెద్దగా వెలుగదా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
మంచిగా మాట్లాడే విధానము తెలిసిన వారికి పిల్ల పెద్ద అనే భెదం లేదు. వారు చిన్న వారైనను మాట్లాడే అవకాశం ఇవ్వవలిసిందే. పిల్లవాడి చేతిలో ఉన్నా కాని కాగడ పెద్దగానే వెలుగుతుంది కదా

No comments:

Post a Comment