Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 404

వేమన శతకం (Vemana Shatakam) - 404

ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన
మాటదెలిసి నడుచు మర్మమెరిగి
మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తే జంతువు అయిన ఎద్దు కూడ మనం చెప్పేది అర్దం చేసుకుని దానికి తగ్గట్టు మసులుతుంది. కాని మూర్ఖుడైన మనిషి ముప్పై ఏళ్ళకి కూడ అర్ధం చేసుకోలేడు.

No comments:

Post a Comment