Saturday, September 28, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 401

వేమన శతకం (Vemana Shatakam) - 401

రాయి రాయి గూర్చి రాయగా రాయగా
నున్ననైన యట్టు లన్ని పనులు
పాటు చేసినంత పరిపాటి యగునయా
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
ఒక రాయిని పట్టుకుని మరొక రాయితో అదె పనిగా రాస్తూ ఉంటే ఎంత గరుకు తనము అయినా పొయి నున్నగా తయారవుతాయి. అలాగే పట్టుదలతో చేస్తూ ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చు.

No comments:

Post a Comment