వేమన శతకం (Vemana Shatakam) - 399
ఆలినమ్మి భువిని నాచారహీనుడై
ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు
ఆడి తప్పకుండ కాడుకాచినవాడు
వాడె పరమ గురుడు వసుధ వేమ.
భావం:-
ఆడిన మాట కొరకు హరిచంద్రుడు ఆలిని అమ్మి, ఆచారము విడనాడి కాటి కాపరియై, పుత్రశోకము అనుభవించి కష్టనష్టాల పాలైనాడు. కాని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. కావున నిజం చెప్పెవాళ్ళు మొదలు ఎన్ని కష్టాలు పాలైనా చివరకు సుఖపడతారు.

No comments:
Post a Comment