Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 382

వేమన శతకం (Vemana Shatakam) - 382

ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగు దానెచ్చటికినేగు
విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యం:
మనుషులు ధనంపై లేనిపోని ఆశలు కల్పించుకోవడం వ్యర్థం. ఎవరైనా సరే, భూమిపై పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు కూడా దేనినీ తీసుకుపోరు. సంపాదించే ధనం ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. తాను అదేమీ లేకుండానే జీవితాన్ని చాలించక తప్పదు. కాబట్టి, లోభత్వాన్ని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి.

No comments:

Post a Comment