Friday, September 27, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 378

వేమన శతకం (Vemana Shatakam) - 378

ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన
దానగుణము లేక దత యగునె?
ఎనుము గొప్పదైన నెనుగుబోలునా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
దానం చేస్తె దాత అవుతాడు కాని, చక్కని రూపు రేఖలు కలిగి, పెద్దగా గడ్డం పెంచుకుని మునిలా తయారైనా కాని దాత కాడు. ఎంత పెద్ద శరీరం ఉన్న దున్నపోతు ఏనుగై పొతుందా?

No comments:

Post a Comment