Thursday, September 26, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 377

వేమన శతకం (Vemana Shatakam) - 377

ఎన్ని భూములు గని యేపాటు పడినను
అంటనీక శనియు వెంట దిరుగు
భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా?
విశ్వదాభిరామ వినురవేమ!


భావం:-
కాలం కలిసి రానప్పుడు ఎంత శ్రమ పడిన ప్రయొజనం ఉండదు. శని మనల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భూమి మార్చినా కాని భొక్త మారడు కదా?

No comments:

Post a Comment