Wednesday, September 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 341

వేమన శతకం (Vemana Shatakam) - 341

అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య
జనన మరణ సంఖ్య జాతి సంఖ్య
దీనినెఱిగి యోగి ధీరుడై యుండును
విశ్వధాభిరామ వినురవేమ


భావం:-
సుర్యోదయాస్తమయాలు, జననమరణాలు, జాతులు లెక్కింపరానివి. అది తెలుసుకున్న వాడే ధీరుడైన యోగి అవును.

No comments:

Post a Comment