Wednesday, September 25, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 338

వేమన శతకం (Vemana Shatakam) - 338

ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన
పంచ లోహములును భస్మమగును
పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా?
విశ్వధాభిరామ వినురవేమ


భావం:-
ఊపిరిలేని కొలిమితిత్తి కొద్దిగా ఊదితేనే మంటలోఉన్న పంచలోహలు భస్మమవుతాయి. అలాగే ఙానులు ఉసూరుమంటే లోకములే దగ్దముకావా? కావున ఙానులు నిశబ్దముగా ఉండకూడదు.

No comments:

Post a Comment