Tuesday, September 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 337

వేమన శతకం (Vemana Shatakam) - 337

చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యం:
స్వాతి కార్తె యందు వర్షపు బిందు చిప్పయందు పడినచో ముత్తెమగును. నీటియందు పడినచో నీటిలో కలిసిపోవును, కనుక ప్రాప్తి ఉన్నచో అదృష్టము ఎక్కడికీ పోదని భావం.

No comments:

Post a Comment