Tuesday, September 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 336

వేమన శతకం (Vemana Shatakam) - 336

మగని కాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునందు
కలిమి లేమి రెండు గల వెంతవారికి
విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యం:
ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం.

No comments:

Post a Comment