Tuesday, September 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 335

వేమన శతకం (Vemana Shatakam) - 335

కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టుఁజేసెఁగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యం:
కర్మమును ఎవ్వరూ దాటజాలరు. దైవము రాజగు ధర్మరాజుని విరాట రాజువద్ద కంకుభట్టు వేషమును ధరింపజేశారు. అలాగే విధి బలవత్తరమని గ్రహించుము అని భావం. 

No comments:

Post a Comment