వేమన శతకం (Vemana Shatakam) - 334
ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని
పిన్న, పెద్దతనము నెన్నబోరు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం:
మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం.

No comments:
Post a Comment