Tuesday, September 24, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 333

వేమన శతకం (Vemana Shatakam) - 333

హీను డెన్ని విద్య లిల నభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జనుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యం:
ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం. 

No comments:

Post a Comment