Sunday, September 15, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 151

వేమన శతకం (Vemana Shatakam) - 151

బోడి తలలు నెల్ల బూడిద పూతలు
నాసనముల మారుతాశనముల
యోగిగాడు లోను బాగు గాకుండిన
విశ్వదాభిరామ వినురవేమ


భావము:
తలను బోడిగా చేసుకున్నా, విభూతి పూతలు పూసుకున్నా, ఎంతగా యోగ విద్యలు ప్రదర్శించినా, ప్రాణాయామాయాలు చేసినా మనసులోని మాలిన్యాలు తొలగిపోకుండా ఎవరూ యోగి కాజాలరు.

No comments:

Post a Comment