Sunday, September 15, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 150

వేమన శతకం (Vemana Shatakam) - 150

ఒడల భూతి బూసి జడలు ధరించిన
నొడయు డయిన ముక్తి బడయలేడు
తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె
విశ్వదాభిరామ వినురవేమ


భావము:
తడికెను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదుకదా !
అలాగే అసలయిన సాధన లేకుండా వొళ్ళంతా విభూతి పూసుకున్నా, వెంట్రుకల్ని జడలు కట్టించిన సాములోరయినా.. అవన్నియు వేషానికే గాని మోక్షానికి పనికి రాదు.

No comments:

Post a Comment