Sunday, September 15, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 149

వేమన శతకం (Vemana Shatakam) - 149

తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు
పార్వతీ భవులును పరమ గురులు
కూలికాండ్ల జగతి గురులన ద్రోహంబు
విశ్వదాభిరామ వినురవేమ


భావము:
తల్లిదండ్రులు తొలి గురువులు. పార్వతీపరమేశ్వరులు పరమ గురువులు.
కాసుల కోసం బోధలు చేసేవారు గురువులుకారు. వారిని అలా అనడమే ద్రోహం.

No comments:

Post a Comment