Saturday, September 7, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 127

వేమన శతకం (Vemana Shatakam) - 127

బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు
కార్యవాదికేల కడుచలంబు
కుత్సితునకేల గురుదేవతాభక్తి
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
బుద్ధిమంతునకు కుదరని స్నేహముతో పనిలేదు. కష్టించి పనిచేయువానికి పట్టుదలలు,పంతాలతో పనిలేదు. అట్లే దుష్టునికి గురువులయందు, దేవతలయందూ భక్తి కుదరదు.అనవసరమని తలతురు.ఇదివేమన పద్యం.

No comments:

Post a Comment