Saturday, September 7, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 126

వేమన శతకం (Vemana Shatakam) - 126

బంగరు బొడగన్న భామల బొడగన్న
చిత్తమునను చింత సేయడేని వాడె
 పరమయోగి వర్ణింప జగమందు
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
కొందరు జనులు బంగారమునకు,భామలకు ఆశపడుచుందురు. కాంతా కనకములకు చలించెదరు.ఎవరైతే బంగారమును, కాంతలను జూచిననూ చలించకయుందురో అతడే శ్రేష్టమైన యోగియని చెప్పబడును. వేమన శతక పద్యం.

No comments:

Post a Comment