Friday, September 6, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 123

వేమన శతకం (Vemana Shatakam) - 123

అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచెముండుటెల్ల గొదువగాదు
కొండ యద్ద మందు గొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
మనది కాని పరుల ఇండ్లకి వెళ్ళి మనమే గొప్పవారి మన్నట్లు కబుర్లు చెప్పకూడదు. అణకువగా ఉన్నందువల్ల మనపరువేమీపోదు.ఎంతోపెద్దకొండ అద్దంలో చిన్నదిగానే కనబడుతుందికదా!వేమన శతకం.

No comments:

Post a Comment