Friday, September 6, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 121

వేమన శతకం (Vemana Shatakam) - 121

తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప
ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ
ప్రాణమెవరిసొమ్ము పాయకుండగ నిల్ప
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
ఇదినాశరీరం కాపాడుకోవాలి అనుకున్నాఅది అనారోగ్యాలపాలవుతూనే వుంటుంది.ప్రాణం కాపాడుకోవాలనుకున్నా ఏదోఒకనాడు వదిలిపోతుంది.ఇంక ధనంమాత్రం ఎవరిసొమ్మని దాచుకుంటాం?వేమనశతకపద్యం.

No comments:

Post a Comment