Thursday, September 5, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 119

వేమన శతకం (Vemana Shatakam) - 119

పూసపోగులైన పుట్టంబు విడియంబు
కాయపుష్టి మిగుల గలిగియున్న
హీనజాతినైన నిందు రమ్మందురు
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
విలువైన బట్టలు,నగలు ధరించి ధనవంతునిగా నున్నయెడల దానికితోడు కండబలముకూడా నున్నయడల అట్టివానికి ఎదురేగి తీసుకొచ్చి సింహాసనమున కూర్చుండబెట్టి సత్కరించెదరు.నీచుడైననూ సరే.వేమన.

No comments:

Post a Comment