Thursday, September 5, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 118

వేమన శతకం (Vemana Shatakam) - 118

ప్రియములేనివిందు పిండివంటలచేటు
భక్తిలేనిపూజ పత్రిచేటు
పాత్రమెరిగి నీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
ప్రేమలేకుండా విందుచేస్తే పిండివంటలు వృధా.భక్తిలేకుండా పూజచేసి ప్రయోజనం ఉండదు. పత్రీ,పూలు చేటు.అర్హత లేనివారికి సువర్ణ దానమిస్తే పుణ్యం రాదుసరికదా!బంగారం వృధా.వేమన శతకం.

No comments:

Post a Comment