Thursday, September 5, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 117

వేమన శతకం (Vemana Shatakam) - 117

ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి
తెగడువారుగాని తెలియలేరు
అమృతపు రుచులను హస్తమేమెరుగును
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
అమృతము రుచిని ఆమాటకొస్తే ఏరుచైనా నాలుకకి తెలుస్తుంది గాని చెయ్యి తెలుసుకొన లేదుకదా!అలాగే పరమయోగీశ్వరులయొక్క విలువ తెలిసికొనలేక కించపరుస్తూవుంటారు సామాన్యులు.వేమన.

No comments:

Post a Comment