Wednesday, September 4, 2019

వేమన శతకం (Vemana Shatakam) - 114

వేమన శతకం (Vemana Shatakam) - 114

కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి
కొండముచ్చులెల్ల కొలిచినట్లు
నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ


భావం:-
కోతులలో ఒకజాతియైన కొండముచ్చు లన్నీచేరి కోతికి కొత్తబట్టలుకట్టి కొలుస్తున్నట్లుగా అవినీతి పరుని అలాంటిఅవినీతిపరులు,దౌర్భాగ్యులు చుట్టూచేరికొలుస్తూంటారు.వేమన పద్యం

No comments:

Post a Comment