Saturday, September 7, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 65

సుమతీ శతకం (Sumathi Shathakam) - 65

కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుగనేరవు
మరియా కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ


భావం:-
సఖ్యత లున్నప్పుడు ఎవరికీ ఎదటివారిలో తప్పులు కనపడవు. స్నేహము చెడిపోయి నప్పుడు విరోధులుగా మారిపోతారు.ఇన్నాళ్లనించీ కనపడని ఎదటివారిలోని ఒప్పులు కూడాతప్పులుగానే కనబడతాయి.సుమతీశతకం

No comments:

Post a Comment