Saturday, September 7, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 63

సుమతీ శతకం (Sumathi Shathakam) - 63

తనకోపమె తనశత్రువు
తన శాంతమె తనకు రక్ష
దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ


భావం:-
తనకోపము శత్రువువలె తననే బాధపెట్టును.శాంతము రక్షకుని వలె తనను కాపాడును.మనము ఇతరులపై చూపిన దయ బంధువులా సాయపడును.సంతోషమే స్వర్గము,దుఃఖమే నరకము వంటివి.అవి ఎక్కడో లేవు.బద్దెన.

No comments:

Post a Comment