Saturday, September 7, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 62

సుమతీ శతకం (Sumathi Shathakam) - 62

బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ


భావం:-
బలమైన పెద్దపాము చిన్నచిన్న చలిచీమలకి చిక్కిచచ్చును. అట్లే మనిషి 'నాకేమి?నాకు కావలసినంత బలము,బలగము వుంది.' అని గర్వపడినచో కడకు అతడికది కీడేచేయును.ఎవరికైననూ గర్వముకూడదని భావము.బద్దెన.

No comments:

Post a Comment