సుమతీ శతకం (Sumathi Shathakam) - 58
ధీరులకు జేయుమేలది సారంబగు
నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మరి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ
భావం:-
కొబ్బరి చెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను ఇచ్చును. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖమును,సంతోషమును కలిగించును. ఇదిసుమతీ శతక పద్యము.

No comments:
Post a Comment