Saturday, September 7, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 60

కృష్ణ శతకం (Krishna Shathakam) - 60

బలమెవ్వడు కరిబ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు రవిసుతునకు
బలమెవ్వడు నాకు నీవు బలమౌకృష్ణా


కృష్ణా! కరిరాజుని కాపాడావు.పాండవుల భార్య ద్రౌపదిని కాపాడావు. రవి సుతుడైన సుగ్రీవునకు అండగా నిలబడి కాపాడావు.నాకూ నీవే బలమని నమ్ముతున్నాను.కాపాడవయ్యా!.కృష్ణ శతక పద్యము.

No comments:

Post a Comment