వేమన శతకం (Vemana Shatakam) - 124
వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును
చీడపురుగుజేరి చెట్టుజెఱుచు
కుత్సితుండుజేరి గుణవంతు జెఱుచురా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:-
వృక్షానికి వేరుపురుగు చేరిందంటే వేళ్ళు కొరికి కూల్చును.అట్లే చెట్లకు చీడపురుగు పట్టి నాశనము చేయును. అదేవిధముగా దురాత్ముడు మంచివారి దగ్గరజేరితే చెడగొట్టును.వేమన.

No comments:
Post a Comment