Saturday, September 7, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 59

సుమతీ శతకం (Sumathi Shathakam) - 59

శుభముల నందని చదువును
నభినయమును రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ


భావం:-
అభినందనలు పొందని చదువు,సరైనరాగముతో నలుగురుమెచ్చని పాటలు,కబుర్లులేని పదుగురికలయిక,సభలోవారు మెచ్చుకోనివక్తల ఊకదంపుడు ఉపన్యాసాలు విలువలేనివిఅంటున్నాడు కవిబద్దెన సుమతీశతకపద్యంలో

No comments:

Post a Comment