Monday, September 2, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 47

సుమతీ శతకం (Sumathi Shathakam) - 47

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లితండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ


భావం:-
సభలోపలను,తల్లిదండ్రులతోనూ,అధికారులతోనూ,పరస్త్రీలతోనూ,బ్రాహ్మణోత్తములతోనూ పరిహాసములు[ఎకసక్కెము]లాడరాదు.ఈపద్యములో నవ్వకుమీఅంటే వెటకారాలు,వెక్కిరింతలు చేయకూడదని.

No comments:

Post a Comment